Wayanad: వయనాడ్‌లో తగ్గిన పోలింగ్ శాతం

by Mahesh Kanagandla |
Wayanad: వయనాడ్‌లో తగ్గిన పోలింగ్ శాతం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్(Wayanad) లోక్ సభ స్థానం ఉపఎన్నికలో(Bypoll) పోలింగ్ శాతం (Polling Percentage) భారీగా పడిపోయింది. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పోటీ చేస్తున్న ఈ స్థానంలో 64.53 శాతం పోలింగ్ నమోదైంది. మొన్నటి సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు ఇదే స్థానంలో 73.57 శాతం పోలింగ్ నమోదవ్వడం గమనార్హం. రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ మార్జిన్‌తో ప్రియాంక గాంధీ గెలుస్తారని ప్రచారం చేసిన కాంగ్రెస్.. పోలింగ్ శాతం తగ్గినప్పటికీ ఆమెనే గెలుస్తారనే ధీమా వ్యక్తం చేసింది. బుధవారం వయనాడ్ లోక్ సభ స్థానంతోపాటు పది రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. పోలింగ్ శాతం 55 నుంచి 90 శాతం మధ్య రిపోర్ట్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ మినహా అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో నైహతి నియోజకవర్గం సమీపంలోని భాత్‌పార దాగ్గర క్రూడ్ బాంబ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ టీఎంసీ కార్యకర్త మరణించారు. బుధవారం నాడు రాజస్తాన్‌లో ఏడు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో ఐదు, బిహార్‌లో నాలుగు, కర్ణాటకలో మూడు, మధ్యప్రదేశ్‌లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరిగింది. అలాగే, ఛత్తీస్‌గడ్, గుజరాత్, కేరళ, మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed