Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-13 17:49:14.0  )
Sri Reddy : నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సినీ నటి, వైసీపీ మద్ధతుదారురాలైన శ్రీరెడ్డి(Sri Reddy)పై తూర్పు గోదావరి జిల్లాలో కేసు నమోదు(case registered)అయ్యింది. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనుచిత విమర్శలు చేశారని టీడీపీ మహిళా నేత మజ్జి పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై 196, 353(2), 79 బీఎన్ఎష్, 67 ఐటీఏ-2000-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది జులై 20న కూడా సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలు త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, హోంమంత్రి అనితలపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్‌ నాయకుడు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాతా సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి పలు సందర్భాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఫిర్యాదులో నాగరాజు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు, క్లిప్పింగులతోపాటు పలు ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించారు. దీంతో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో తాను చేసిన విమర్శలకు కూటమి నేతలకు క్షమాపణలు చెప్పినప్పటికి కేసుల నుంచి తప్పించుకోలేక పోయింది. అటు ఇప్పటికే వైసీపీ నేత నటుడు పోసోని కృష్ణ మురళి, దర్శకుడు రాంగోపాల్ వర్మలపై కూడా కేసులు నమోదయ్యాయి.

సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్న వారిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ చర్యలు చేపట్టింది.అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Next Story