- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొలాల్లో Resorts.. వీకెండ్ పార్టీల నిర్వహణ !
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: వీకెండ్ వచ్చిందంటే చాలు శివారు ప్రాంతాలు గుర్తుకు వస్తున్నాయి. వీకెండ్‌లో జల్సాలు చేయడానికి శివార్లలో ఉన్న పలు రిసార్ట్స్ కేంద్రాలను అద్దెకు తీసుకుని జల్సాలు చేస్తున్నారు. దొరికితే తప్ప వెలుగులోకి రాని నిజాలెన్నో తెలుస్తున్నాయి. పలుకుబడి కలిగిన వారి పుత్ర రత్నాలు జల్సాల నిమిత్తం తమ చదువు, వయసు మరిచి మితిమీరి వ్యవహరిస్తున్నరనడంలో సందేహం లేదు. ఇదే తరహాలో శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాటీలోని పసుమాములలో జరిగింది. పొలీసుల తనిఖీల్లో గంజాయి సేవిస్తూ నలుగురు అమ్మాయిలు, మరో ముప్పై మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టుబడ్డారు.
నివ్వెరపోయే నిజాలు..
సీబీఐటీ, ఎంజీఐటీలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధులు తమలో ఒకరైన జితిన్ సుభాష్ బర్త్ డే వేడుకల నిమిత్తం పసుమాముల లో అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిలో నిర్వహిస్తున్న 'ఔట్ ఆఫ్ ద బాక్స్' రిసార్ట్స్ కు నలుగురు అమ్మాయిలు, ముప్పై మంది అబ్బాయిలు వచ్చారు. జల్సా లో భాగంగా గంజాయి సేవిస్తుండగా, స్థానికులకు డీజే సౌండ్ ఇతర సమస్యలు ఎక్కువ కాగా సమాచారం పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు ప్రజలు నివ్వెరపోయే నిజాలు కనిపెట్టారు. ఖరీదైన కార్లు, మోబైల్స్, బైక్‌లతో పాటు కొంత గంజాయి, నగదు కూడా పట్టుకున్నారు.
కనీసం రెండు పదుల వయసు కూడా నిండక ముందే ఇలాంటి నిర్వాకాలకు పాల్పడడం వంటివి చూస్తుంటే సమాజంలో విద్యార్థుల పాత్రపై తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు పలువురు విద్యార్ధులతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరిపై కాకుండా కొంత మంది విద్యార్థులపైనే కేసులు నమోదు కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.