ప్రభుత్వ భూమిలోనే బహుళ అంతస్తు.. అధికారులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు

by Vinod kumar |   ( Updated:2022-11-29 15:35:48.0  )
ప్రభుత్వ భూమిలోనే బహుళ అంతస్తు.. అధికారులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రజల కోసం పనిచేస్తామని ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన పాపానికి ఇష్టానుసారంగా భూకబ్జాలు చేశారు. ఒక్కసారి మునగనూర్​ గ్రామ ప్రజలు నక్క శ్రీనివాస్​గౌడ్​భార్యను సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే కనిపించిన చోట కబ్జాలు చేసుకుంటా అమాయక ప్రజలను మోసం చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్​ మెట్టు మండలం మునగనూర్​గ్రామ పరిధిలోని సర్వే నెంబర్​ 38 లో 66 ఎకరాల 5 గుంటల భూమి రికార్డు లెక్కల ప్రకారం ఉంది. కానీ, ఈ సర్వే నెంబర్‌ను క్షేత్రస్ధాయిలో పరిశీలిస్తే భూ విస్తీర్ణంలో కేవలం పదుల సంఖ్యల ఎకరాల్లోనే భూమి కనిపిస్తోంది. చాలా విస్తీర్ణం ప్రభుత్వ భూమి శ్రీనివాస్​గౌడ్​నిర్వాహాకం వల్లే అన్యాక్రంతమైయిందని జర్నలిస్టు కాలనీ వెల్ఫర్​అసోసియేషన్​ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్​కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు.


నకిలీ దృవపత్రాలను సృష్టించి ప్రభుత్వ భూములను క్రయ విక్రయాలకు ఉపయోగించుకున్నట్లు తెలిపారు. ఈ విధంగా రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి, ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు నక్క శ్రీనివాస్​గౌడ్​చేసే అక్రమాలపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్​చేశారు. జర్నలిస్టుల ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ అమోయ్​కుమార్​ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్టీవోను ఆదేశిచ్చారు.

ప్రభుత్వ భూమిలోనే బహుళ అంతస్తు..

రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్​ మెట్టు మండలం మునగనూర్​ గ్రామంలోని సర్వే నెంబర్ 38 లో మొత్తం 66 ఎకరాల 5 గుంటల భూమి ఉండగా ఇందులో 38/ఇ/3 లో ఎకరం, 38/అ/3లో ఎకరం, 38/ఆ/3లో ఎకరం, 38/1లో 8 ఎకరాలు, 38 లో 55 ఎకరాల 5 గుంటల భూమిగా విభజించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు పేదలకోసం 60, 50 గజాల చొప్పున స్థలాలను కేటాయించడం జరిగింది. అదే పద్ధతిలో శ్రీనివాస్​గౌడ్​అనే వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అలాంటి శ్రీనివాస్​ గౌడ్ ​ఇంటి స్థలం నేడు 600 గజాలకు చేరుకోవడం పై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వందల గజాల స్థలాన్ని ప్రభుత్వ కండ్లు కప్పి కబ్జా చేసి బహుళ అంతస్థుల నిర్మించుకున్నాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయడం జరిగింది. అటు గ్రామ పంచాయతీ.. ఇటు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్థులు నిర్మించారు.


అంతేకాకుండా అధికారిక అనుమతులు లేకుండా ఇండ్లు నిర్మించడమే కాకుండా నకిలీ ధృవ పత్రాలను సృష్టించి, ప్రభుత్వ భూమిని పూర్తిగా అమ్మకానికి పెట్టడం విశేషం. ఇలాంటి వ్యక్తి జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారు. కబ్జాలతో కాలం గడిపే వ్యక్తి నిబంధనలకు అనుకూలంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ భూమిని కబ్జా చేసుకుని విక్రయాలు చేయాలని శ్రీనివాస్​గౌడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కబ్జాదారుడే జర్నలిస్టులపై తిరుగుబాటు చేయడం తో ఆశ్చర్యం కలుగుతుంది.

అప్పుడేందుకు గుర్తుకు లేదో..

మునగనూరు సర్వేనెంబర్ 38 లో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని కబ్జాలకు రాకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కనిపించిన ప్రతి చోట ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి అమ్ముకున్న శ్రీనివాస్​గౌడ్​నేడు ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడంతో అందరికీ నవ్వు వస్తుంది. ఇదే శ్రీనివాస్​ గౌడ్​భార్య పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నప్పుడు పార్క్, జీమ్‌లకు స్థలం కేటాయించాలనే సోయి లేదు. అప్పుడు కనిపించిన చోట కబ్జాలు చేసి అమ్ముకున్న వ్యక్తి నేడు జర్నలిస్టుల భూమిని పార్క్, జీమ్‌లకు కేటాయించాలని నీతులు పలకడం వెనుక ఆంతర్యమేమిటని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. వీటి పేరుతో భూములను కాజేసుకునేందుకు కుట్ర జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed