- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కల్వకుర్తి ప్రాంతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నోచుకోలేదు : కసిరెడ్డి
దిశ, కడ్తాల : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన కల్వకుర్తి ప్రాంతానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాకపోవడం ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అసమర్థతనే కారణమని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఆదివారం గోవిందపల్లి తండా, వాసుదేవ్పూర్, నేరెళ్ల కుంట తండా, గుట్టల మీది తండా, రాజీవ్ నగర్ తండా, బాలాజీ నగర్ తండా, కాడ్యా తండాలలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిచ్చా నాయక్ ఆధ్వర్యంలో పీసీసీ సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి గిరిజన తండాలు గ్రామాలలో కసిరెడ్డి విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం గా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కసిరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గానికి పక్కనున్న నియోజకవర్గాలైన మహేశ్వరం, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్నగర్ లాంటి తాలూకాలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసిన కూడా మన అసమర్ధ ఎమ్మెల్యే వల్ల ఇక్కడి పేదలకు తీరని నష్టం జరిగిందని, విద్య, వైద్యం రంగాలు భ్రష్ట పట్టిపోయాయని ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని తమ అమూల్యమైన ఓట్లు వేయాలని కసిరెడ్డి ప్రజలకు సూచించారు. మీకు ఏ నాయకుడైతే సాయపడతాడు,న్యాయం చేస్తాడు అని మీ మనసుకు నచ్చిన వారికి మాత్రమే ఓట్లు వేయాలని ఎన్నికల ముందు ఇచ్చే నాయకుల మాటలకు, ప్రలోభాలకు గురికాకుండాదని కోరారు.
మీరు వేసే ప్రతి ఓటు నాయకుడు ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటాడు అనే విషయాన్ని మర్చిపోకూడదని స్పష్టం చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కమ్లి మోత్య నాయక్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, చందోజి, అద్దాల రాములు, హనుమాన్ నాయక్, లక్ష్మణ్ నాయక్ ,పర్వతాలు యాదవ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.