- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ గుర్తింపు : మంత్రి నిరంజన్ రెడ్డి
దిశ, తాండూరు రూరల్ : తాండూరు కందిపప్పుకు అంతర్జాతీయ గుర్తింపు జీఐ రావడం తెలంగాణ ప్రతిష్టలు మరింత పెంచిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తాండూరు కందిపప్పు కు భౌగోళిక(జీ ఐ ) లభించిన నేపథ్యంలో మంగళవారం తాండూరు ప్రొఫెసర్ జయశంకర వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులకు అభినంద సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. సభకు తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రితో కలిసి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, ఇతరులు జ్యోతి వెలిగించారు. సమావేశంలో తాండూరు కందిపప్పుకు జీ ఐ గుర్తింపు సర్టిఫికెట్లు ప్రజా ప్రతినిధులు, సైంటిస్టుల సమక్షంలో రైతులకు అందజేశారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని నూనెలకన్నా కుసుమ నూనె శ్రేష్ఠమైనదని, ఆ పంటను వెయ్యాలన్నారు.
తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 అంశాలలో జియో ట్యాగింగ్ వచ్చినప్పటికీ ఆనాటి పాలకులు ఆ విషయాన్ని మరుగున పరిచారని ఆరోపించారు. తెలంగాణలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన 16వది తాండూరు కందిపప్పు అని పేర్కొన్నారు. కృష్ణా నదిలోని నీటి వాటలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీర్చలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలో ఆ నీరు ఈ ప్రదేశంలోని నేలను ముద్దాడనున్నయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డివో అశోక్ కుమార్, సైంటిస్ట్ హెడ్ ఏఆర్ఎస్ సుధారాణి, సైంటిస్ట్ ఆగ్రోనమీ ఏఆర్ఎస్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖ అధికారులు, నేతలు, రైతులు పాల్గొన్నారు.