- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా పనితీరుకు ఆ అవార్డులే నిదర్శనం..
దిశ, తాండూరు రూరల్ : తమ సమస్యలు పరిష్కరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గురువారం మండలపరిషత్ కార్యాలయ ఆవరణలో ముగ్గులతో వినూత్నంగా నిరసన చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి మోస్తున్న పలుశాఖల కార్యక్రమాలు చేపడుతున్న పనుక పై కార్యదర్శి మోస్తున్నట్టు ముగ్గులు, గోరింటాకులు వేసి నిరసన చెప్పటామని కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షులు లాలప్ప తెలిపారు. అనంతరం లాలప్ప మాట్లాడుతూ ప్రొబిషన్ పిరియడ్ మూడు సంవత్సరాలు దాటినా తమను రెగ్యులరైజ్ చేయడం లేదని పంచాయితీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పెంచిన మరో ఏడాది ప్రొబిషన్ కాలం కూడా ముగిసినా రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు.
గ్రామాలలో పచ్చదనాన్ని తీసుకొచ్చిన ఘనత పంచాయతీ కార్యదర్శులకే దక్కుతుందన్నారు. దేశంలో 33 గ్రీనరీ అవార్డులకు 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయన్నారు. మా పని తీరుకు ఆ అవార్డులే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పంచాయతీ జూనియర్ కార్యదర్శులు అర్హులుగా ఉన్నారని తెలిపారు. వెంటనే జూనియర్ కార్యదర్శులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రవి, పకిరోజీ, రాములు, బాల్ రాజ్, అశోక్, యాదరిగి, శ్రావణి, శృతి, అంభిక, శిరీష, అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.