అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు.. తరచుగా రోడ్డు ప్రమాదాలు

by Aamani |
అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు.. తరచుగా రోడ్డు ప్రమాదాలు
X

దిశ,నందిగామ : రహదారుల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నాయకులు చెప్పుకొచ్చారు. కానీ అవేం లేకుండా రహదారుల నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగడి. అక్కడే ఉందని ప్రజలు అంటున్నారు. నందిగామ మండల కేంద్రం నుంచి అంతి రెడ్డి గూడా, వయా నర్సప్ప గూడ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం గత సంవత్సరం లో 2023. మే 5న అప్పటి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రూ. 3.10 లక్షల తో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించారు. నందిగామ మండల కేంద్రం నుంచి అంతి రెడ్డి గుడా వరకు మాత్రమే పనులు చేపట్టి మధ్యలో పనులు అసంపూర్తిగా నిలిచాయి.

తరచుగా రోడ్డు ప్రమాదాలు..

అంతిరెడ్డిగూడ నుంచి నర్సప్పగూడ వరకు మధ్యలో రోడ్డుపై కంకర పరిచి బీటీ రోడ్డు వదిలేశారు. ఇలా అసంపూర్తిగా పనులు ఉండడంతో కంకర తేలిన రోడ్డు ఇరువైపుల నుంచి మట్టి కుప్పలు అలాగే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఎదురెదురుగా ఒకేసారి రెండు వాహనాలు ఎదురైతే తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న మంచి రోడ్డును త్రవ్వి కొత్త రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంతో ఆశ పడ్డాం కానీ అలా లేదు. కంకరపర్చి బీటి మరిచిపోవడంతో నిత్యం ప్రతిరోజు రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బంది కరంగా ఉందని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు అసంపూర్తిగా ఉన్న పనులు చేపట్టాలని మేము కోరుతున్నాం.

ఇబ్బందులు పడుతున్నాం : వడ్ల అరవింద్ నర్సప్పగూడ

నందిగామ నుంచి నర్సప్పగూడ వరకు మధ్యలో కంకర పరిచి బీటీ రోడ్డు వదిలేయడంతో కంకర తేలి రోజు ప్రయాణించాలంటే రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం.

త్వరలో పనులు ప్రారంభిస్తాం : హేమంత్ పంచాయతీరాజ్ ఏఈ నందిగామ

నందిగామ నుంచి నర్సప్పగూడ మధ్యలో అసంపూర్తిగా ఉన్న పనులు నిలిచిన విషయం వాస్తవమే. త్వరలో త్వరలో ప్రారంభిస్తాం.

Advertisement

Next Story

Most Viewed