- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసంపూర్తిగానే బ్రిడ్జి పనులు.. ఏండ్లు గడుస్తున్నా పట్టించుకోరా..
దిశ, పెద్దేముల్: ప్రజాప్రతినిధులు మారినా గాజీపూర్ వాగు నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. తాండూర్ -సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ వాగు బ్రిడ్జి పనులను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రు కోట్లతో ఆనా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఏడు సంవత్సరాల నుండి బ్రిడ్జి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గత సంవత్సరం ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందని 'గాజీపూర్ కొత్త బ్రిడ్జ్ కలేనా' అని దిశ పత్రికలో వరుస కథనాలు రావడంతో ఆనాటి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించి కొత్త బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోయించి తాత్కాలికంగా మట్టి రోడ్డు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తిరిగి బ్రిడ్జి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత బ్రిడ్జ్ కు ఇరువైపులా మట్టి రోడ్డులో గుంతలు పడ్డాయి. కొత్త బ్రిడ్జి ఇరువైపులా మట్టి రోడ్డు కొనడం వల్ల వాహనాలు ఎక్కడికక్కడే బురదలో ఇరుక్కుపోతున్నాయి. దీనితో భారీ వాహనదారులకు ముందున్నయి వెనక గొయ్యి అన్నట్లు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుతున్నారు.
- Tags
- Telugunews
- Bridge