- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్యూచర్ సిటీలో మా గ్రామాన్ని చేర్చండి.. ఎమ్మెల్యేకు వినతి

దిశ, యాచారం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ లో తమ గ్రామాన్ని చేర్చాలని గురువారం మండల పరిధిలోని మొండి గౌరెల్లి, గ్రామస్తులు కొలన్ బుచ్చిరెడ్డి, మేకల యాదగిరి రెడ్డి, మర్రిపల్లి అంజయ్య యాదవ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నివాసంలో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొండి గౌరెల్లి, మంతన్ గౌరెల్లి, గ్రామస్తులు అధైర్య పడద్దని తెలిపారు. ఈ రెండు గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వల్ల ముల బుచ్చి రెడ్డి, తాండ్ర రవీందర్, నక్క శ్రీనివాస్ యాదవ్, మాధం జంగయ్య, కుంచరాపు సందీప్ రెడ్డి, గుర్రం జంగారెడ్డి, గుడాల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.