- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ -బీజాపూర్ రహదారి విస్తరణ పనులు వెంటనే ప్రారంభించాలి : సబితా ఇంద్రారెడ్డి
దిశ, శంకర్ పల్లి : హైదరాబాద్- బీజాపూర్ ( పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ) అంతరాష్ట్ర రహదారిని నాలుగో లైన్ల రహదారిగా విస్తరించే పనులు వెంటనే ప్రారంభించాలని విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. చేవెళ్ల మీర్జాగూడ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆదివారం మృతి చెందగా సోమవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ… చేవెళ్ల రహదారిపై రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని నాలుగు లైన్ల రహదారి విస్తరణ కోసం జాతీయ రహదారిగా మార్పు కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందని ప్రస్తుతం రాజకీయాలకతీతంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రోజురోజుకు రహదారిపై వాహనాల సంఖ్య పెరగడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ నుంచి రోడ్డు పూర్తయినందున ఇది కొడంగల్ కు వెళ్లే రహదారి ఉన్నందున మిగతా మన్నెగూడ నుంచి పోలీస్ అకాడమీ వరకు రోడ్డు పనులు ప్రారంభమవుతున్నాయని ఎంతోమంది సంతోషపడ్డారని కానీ రోడ్డు పనులు చేపట్టడంలో జాప్యం జరగడం పట్ల రోజు రోజుకు ప్రమాదాల సంఖ్య పెరగడంతో పాటు మృత్యువుల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, పొద్దుటూరు మాజీ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, మాజీ ఎంపిటిసి బొల్లారం వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి మన్నె లింగం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.