RR: తెలంగాణలో లారీ బీభత్సం.. ఆరుగురు దుర్మరణం, ఏడుగురికి సీరియస్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-02 13:41:55.0  )
RR: తెలంగాణలో లారీ బీభత్సం.. ఆరుగురు దుర్మరణం, ఏడుగురికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి(RangaReddy) జిల్లాలో లారీ(Larry) బీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాపారుల పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిరు వ్యాపారులు(Small Traders) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 7 గురు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల(Chevella) మండలం ఆలూరు స్టేజీ వద్ద సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 50 మందికి పైగా వ్యాపారులు రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed