ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు.. విజేతలకు రూ. 50 వేలు

by S Gopi |
ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు.. విజేతలకు రూ. 50 వేలు
X

దిశ, తాండూరు రూరల్: హోలీ పండుగ సందర్భంగా రోహిత్ అన్న యువసేన ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణం భద్రప్ప గుడ్డి ఆవరణంలో హోలీ వేడుకలను ధూంధాంగా నిర్వహించారు. ఈ వేడుకకు తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో భారీ ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ పోటీలో మల్కాపూర్ గ్రామ యువకులు, మల్కాపూర్ గ్రామానికి చెందిన, పాత తాండూరు యువకులు విజేతలుగా నిలిచారు. మొదటి బహుమతి విజేతలకు నగదు రూపంలో రూ. 50,000, రెండవ బహుమతి విజేతలకు రూ. 25000 వేలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.


నియోజకవర్గ నాయకులతోపాటు చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే హోలీ సంబరాలలో పాల్గొని చిందులు వేశారు. యువత కేరింతలు డ్యాన్సులతో హోరేత్తుతున్న హోలీ సంబరాలు, చిన్న, పెద్ద, యువతీయువకులు, అధికారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సాంప్రదాయంలో సంస్కృతిని మరువరాదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువతి, యువకులు, చిన్నారులు, ఇతరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed