- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల తవ్వకాల కలకలం.. 9 మంది అరెస్టు
దిశ, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లోని హనుమాన్ దేవాలయం పక్కనే ఉన్న ఓ పురాతన ఇల్లు ఉంది. దీంట్లో గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారని పక్క సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో అక్కడ తవ్వకాలు జరుపుతున్న హిమాయత్ సాగర్‌కు చెందిన వినోద్‌తో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మూడు కారులను సీజ్ చేశారు. హిమాయత్ నగర్‌కు చెందిన వినోద్ వాల్ల అమ్మమ్మ ఊరు బుద్వేల్‌లోని వారికి దాదాపు 400 గజాలలో ఇడ్లు ఉంది.
అందులో బంగారం గుప్త నిధులు ఉన్నాయని ఓ బాబా వినోద్‌కు చెప్పడంతో గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం రాత్రి వారి స్నేహితులతో కలిసి తవ్వకాలు నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. దీంతో వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధుల తవ్వకాల్లో స్వాధీనం చేసుకున్న మూడు కార్లలో ఒక (TS 09 ES 6114) కారుపై టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అని నేమ్‌ప్లేట్ పై ఉండడం విశేషం ఈ కారు ఎవరిదని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.