- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవపై కీలక అప్‌డేట్!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పలు కీలక శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నిన్న(గురువారం) సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించారు.వ్యవసాయ శాఖపై సమీక్షలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విత్తన కొరత ఉండొద్దని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రూ.36 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. ‘అన్నదాత-సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈక్రమంలో ఉద్యాన పంటల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.