- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోఫా గోదాంలో భారీ అగ్నిప్రమాదం..
దిశ, బడంగ్ పేట్: జల్ పల్లిలోని ఓ సోఫా గోదాంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పహాడీషరీఫ్ ఇన్ స్పెక్టర్ విశ్వనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లికి చెందిన మొహమ్మద్ షోయబ్ వాదియె ఉమర్‌లో ఓ గోదాంలో గత కొంత కాలంగా సోఫాలు తయారు చేస్తున్నారు. ఎప్పటి లాగే బుధవారం రాత్రి పనులు ముగించుకున్న అనంతరం గోదాంకు తాళం వేసి వెళ్లారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం యజమాని మొహమ్మద్ షోయబ్ స్థానికులు ఫోన్ చేసి మీ గోదాంలో మంటలు చెలరేగుతున్నాయని చెప్పారు.
వెంటనే యజమాని పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహాడీ షరీఫ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్‌ల ద్వారా నాలుగు గంటలు శ్రమించి మంటలు ఆర్పేశారు. అప్పటికే పూర్తిగా తయారైన సోఫాలతో పాటు సోఫాకు సంబంధించిన సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యింది. రూ. 15 లక్షలు వరకు ఆస్తి నష్టం సంభవించిందని షోయబ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.