విద్యార్థులను అభినందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Sumithra |   ( Updated:2023-05-12 16:51:39.0  )
విద్యార్థులను అభినందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్​పేట్ :​ జల్​పల్లి మున్సిపాలిటీ శ్రీరామ్​ కాలనీలోని శ్రీ విద్యాభారతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాల విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తమ ఫలితాలు సాధించారు. 72 మంది విద్యార్థులు ఎస్​ఎస్​సీ పరీక్షలు వ్రాయగా అందులో ఆర్​.శ్రావణి 10/10, జి.మాధురి 9.5, ఎం.ప్రీతి 9.5, కె.నాగశృతి 9.2, ఎన్​.ఆదిత్య 9.2, సోహన్​ స్వామి 9.2, వి. వర్షిత 9.2, కె.అరుణ 9.0, కె.వైభవ్​ 9.0 ఫలితాలను సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్​ పి.భీమయ్య, కరెస్పాండెంట్​ వి.రాజులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్​ పల్లపు శంకర్​లు అభినందించారు.

Advertisement

Next Story