రైతుల రుణమాఫీ పై సందిగ్థం.. వరదలతో భారీగా నష్టపోయిన రైతులు

by Jakkula Mamatha |
రైతుల రుణమాఫీ పై సందిగ్థం.. వరదలతో భారీగా నష్టపోయిన రైతులు
X

దిశ,నారాయణఖేడ్:సహకార సంఘాల్లో రైతులు తీసుకున్న పంట రుణాల తేదీల నమోదులో జరిగిన పొరపాటుతో అర్హులకు రుణమాఫీ కానీ సంఘటన వెలుగులోకి వచ్చింది. సిబ్బంది చేసిన సాంకేతికపరమైన తప్పిదంతో అన్నదాతలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో 52 సహకార సొసైటీల్లో 16 సొసైటీలో ఈ సమస్య తలెత్తడంతో రుణమాఫీ పూర్తిగా కాలేకపోయింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 12 సొసైటీలకు గాను, 6 సొసైటీలో పూర్తిగా రుణమాఫీ జరగకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. 12 సొసైటీల్లో రుణ బకాయిలు మొత్తం సుమారు రూ. 35.49 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి ఎలాంటి పొరపాటు లేకపోవడంతో అర్హులుగా గుర్తించి మాఫీ వర్తింపజేయాలని అధికారులు ఇప్పటికే ఉన్నంత స్థాయికి నివేదించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి కంగ్టి, మార్ది సొసైటీ సెక్రెటరీ లను సస్పెండ్ చేశారు. గత ఏడాది డిసెంబర్​ 9వ తేదీ వరకు మాత్రమే రుణమాఫీకి అర్హులు ప్రభుత్వం నిర్ణయించగా సోసైటీలో రుణాలు డిసెంబర్​ 9 తర్వాత తీసుకున్నట్లు అధికారులు తప్పుడు సమాచారాన్ని నమోదు చేయడంతో రైతులు నష్టపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేసి రుణమాఫీ వర్తింపజేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

అసలు ఏమి జరిగింది..

మాఫీకి గత ఏడాది డిసెంబర్ 9వ తేదీ లోపు రుణాలు పొందిన వారే అర్హులు..సహకార సొసైటీలు తమ పరిధిలోని రైతులకు సహకార కేంద్రం బ్యాంకు డీసీసీబీ నుంచి రుణాలు మంజూరు చేస్తాయి. ఈ సందర్భంలో సొసైటీ కి చెందిన రైతులు అందరికీ మంజూరైన రుణాలు మొత్తాన్ని మొదట సొసైటీ ఖాతాలో వేసిన అనంతరం రైతుల ఖాతాల్లోకి విడిగా జమ చేశారు. ఈ క్రమంలో సహకార బ్యాంకు నుంచి రుణాలు మంజూరైన తేదీ నుంచి రైతు ఖాతాలో జమ చేసే నాటికి ఆలస్యం జరిగింది. మాఫీ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకుల నుంచి పంట రుణాల వివరాలు సేకరించింది. ఈ సందర్భంలో సహకార సొసైటీ పరిధిలోని రుణాలు వివరాలు తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకు (టెస్కాట్) నుంచి తీసుకుంటుంది. రైతుల ఖాతాల్లో రుణాల సొమ్ము జమ చేసిన తేదీలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. అవి డిసెంబర్ 9 తర్వాత తేదీలు కావడంతో సదరు ఖాతాలకు రుణమాఫీ వర్తింప లేదు.

ఖేడ్ డివిజన్‌లో మాఫీకాని రూ. 35. 49 కోట్లు

నారాయణఖేడ్ 12 సొసైటీలకు గాను, 6 సొసైటీలో అడపాదడపా రుణమాఫీ అయినప్పటికీ 6 సొసైటీలో రైతులకు పూర్తిగా రుణమాఫీ కాలేకపోవడంతో నిరాశతో ఉన్నారు. నారాయణఖేడ్ సొసైటీలో 32 గ్రామాలకు సంబంధించిన 836 మంది రైతులకు 230 మంది రైతులకు రూ.1 కోటి 20 లక్షలు రుణమాఫీ కాగా, రూ. 4 కోట్ల 50 లక్షలు రుణమాఫీ కావాల్సి ఉంది. ఎల్టి లోను సంబంధించి రూ.3 కోట్ల 70 లక్షలకు రూ. 2 కోట్లు 70 లక్షలు రికవరీ కాగా, 1 కోటి బకాయి ఉంది. ఉమ్మడి మనూర్ సొసైటీలో 800 మంది రైతులకు గాను రూ.6 కోట్ల 20 లక్షల అరుణమాఫీ కావాల్సి ఉంది. ఈ సొసైటీలో ఇప్పటివరకు ఒక రూపాయి రుణమాఫీ కాలేకపోవడంతో సొసైటీకి వచ్చి రోజు తిరిగి వెళ్లిపోతున్నారు.

ఉమ్మడి కంగ్టి సొసైటీలో 33 గ్రామాలు, 30 తాండ లో రైతులు 660 మందికి రూ.6 కోట్ల రుణమాఫీ కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఒక రైతుకు కూడా రుణమాఫీ జరగకపోవడం పలు అనుమానాలు తావిస్తున్నది. ఎల్ టీ లోనుకు సంబంధించి 200 మందికి రూ.5 కోట్లు రుణాలు ఇచ్చినప్పటికీ ఒక రూపాయి కూడా రికవరీ చేయలేదు. బొక్క స్ గాం సొసైటీలో ఐదు గ్రామాలకు సంబంధించిన రైతులు 1380 మంది రైతులకు గాను, ప్రస్తుతం 1045మంది రైతులు గాను, 595 రైతులకు రూ. 3 కోట్ల 54 లక్షలు మాఫీ కాగా, 450 రైతులకు రూ.2 కోట్ల 50 లక్షల రుణమాఫీ కావాల్సింది. కిష్టాపూర్ సొసైటీలో రెండు గ్రామాలకు గాను గతంలో 432 మంది రైతులు సరైన టైంలో కట్టకపోవడంతో సొసైటీ నుంచి రైతులను మెంబర్షిప్ నుంచి తీసేసారు. కొత్తగా 145 మంది రైతులకు గాను, 102 మందికి 54 లక్షలు 45 వేలు రుణమాఫీ కాగా, 43 మంది రైతులకు 45 లక్షల రుణమాఫీ కావాల్సి ఉంది. బాచేపల్లి సొసైటీలో ప్రస్తుతం 1100 మంది రైతులు 489 మంది రైతులకు రూ. మూడు కోట్ల 9 లక్షల రుణమాఫీ కాగా, 61 మంది రైతులకు రూ.4 కోట్ల 50 లక్షలు రుణమాఫీ కావాల్సి ఉన్నది.

పూర్తిగా రుణమాఫీ కానీ 6 సొసైటీలు..

గంగాపూర్ సొసైటీలో ఐదు గ్రామాల రైతులు 623 మంది రైతులు సొసైటీలో ఉండగా, సొసైటీలో పనుల్లో నిర్లక్ష్యంగా జరగడంతో తనకు అనుకూలమున్న బ్యాంకులో లోను తీసుకున్నారు. ప్రస్తుతం 80 మంది రైతుల రూ.30 లక్షల రుణమాఫీ కావాల్సి ఉంది. కడ్పల్ సొసైటీలో మూడు గ్రామాలకు సంబంధించి 350 మంది రైతులకు రూ.2 కోట్లు రుణమాఫీ ఈ సొసైటీలో ఒక రైతు కూడా రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నారు. బీబీపేట సొసైటీలో నాలుగు గ్రామాలకు కాను, 997 మంది రైతులకు రూ.3 కోట్లు రుణమాఫీ కావాల్సిఉంది. ఒక రైతుకు రుణమాఫీ కాకపోవడంతో తల్లడిల్లుతున్నారు. మార్ది సొసైటీలో 460 మంది రైతులకు రూ. 1 కోటి 85 లక్షలు రుణమాఫీ కావాల్సింది. ఈ సొసైటీలు కూడా ఇది ఇప్పటివరకు ఒక రైతు రుణమాఫీ కాకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంజీవ రావు పేట సొసైటీలో రెండు గ్రామాల 431 మంది రైతులు రూ. 2 కోట్ల 20 లక్షలు రుణమాఫీ కావాల్సి ఉన్నారు. కల్హేరు సొసైటీలో 528 రైతులకు గాను, రూ.2 కోట్ల రుణమాఫీ కావాల్సింది. దీంతో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు.ఎస్బిఐ బ్యాంకు, అధికారుల తప్పొప్పులు జరిగి తమకు రుణమాఫీ కాలేకపోయిందని రైతులు వేదనం చెందుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ రుణమాఫీకి వర్తించదు 6 సొసైటీలు అని తెలుపడంతో రైతులు ఆవేదనం గురవుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా రుణమాఫీ జరుగుతోందని ఆశతో ఎదురుచూస్తున్నారు. మనూర్ ,మర్ది, గంగాపూర్, సంజీవన్ రావుపేట, కడపల్, కల్హేరు అద్దె భవనాల్లోనే సొసైటీ భవనాలు ఇరుకు గదిలోనే కొనసాగుతున్నాయి.

లోపాలకు సాకులు..

సహకార సొసైటీలో పంట రుణాల ఖాతాల వివరాలను ఇంటలెక్ట్ స్టాప్ వేర్ ద్వారా నిర్వహిస్తుంటారు. రుణాల మంజూరు, వడ్డీ చెల్లింపు, రెన్యువల్ వివరాలు మొదట మ్యాన్‌వెల్ గా రికార్డు పుస్తకాల్లో నమోదు చేసేవారు. కొన్ని రోజులు గడిచాక కూడా వివరాలను రైతులు చెల్లించిన తేదీ వేసి ఆన్ లైన్ లో చేసే వెసులుబాటు ఈ స్టాప్ వేర్ లో గతంలో ఉండేది. ఇలా 3 నెలల వరకు పూర్వ తేదీలు వేయడానికి వీలుండేది. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేదనే విషయం చాలా సొసైటీల్లో పనిచేసే పొరుగు సేవల కంప్యూటర్ ఆపరేటర్లకు తెలియదు. వీరు ఎప్పటిలాగే ఆలస్యంగా రుణాల వివరాలు నమోదు చేయగా.. అవి పూర్వం తేదీలు తీసుకోలేదు. దీంతో సమస్య ఏర్పడింది. సోకాస్ నోటీసులు అందుకున్న కార్యదర్శుల్లో కొందరు ఇచ్చిన సమాధానాల్లో కొంత రుణాలు ఖాతాల విషయంలోనే సమస్య తలెత్తినట్లు పేర్కొంటున్నారు. కొత్త ఖాతాలు ఏర్పాటు చేసి రుణాల సొమ్ము జమ చేయాలంటే... డీసీసీబీ బ్యాంక్ ప్రక్రియలో ఆలస్యమైనట్లు వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంటున్న ఈ పొరపాట్లు అంశం.. ఇప్పుడు ప్రభుత్వం పెద్దల వద్దకు చేరింది. సానుకూల నిర్ణయం తీసుకున్నాకే.. బాధిత రైతుల రుణాలు మాఫీ అయ్యే పరిస్థితి నెలకొంది. అంతా నిరుపేద కుటుంబాలే ఎక్కువగా ఉండడంతో రుణమాఫీ కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.

ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది..

బ్యాంకుల్లో గాని, సొసైటీలో గాని, రుణమాఫీ తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.రైతులు ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దని, ఆలస్యమైనప్పటికీ ప్రతి ఒక రైతుకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ఏ రైతు కూడా అధైర్యపడవద్దని, రుణమాఫీ కోసమే ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed