‘రాజీవ్ గాంధీ విగ్రహం’ సీఎం ఇన్నోవేటివ్ ఐడియానే.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-09-16 13:10:01.0  )
‘రాజీవ్ గాంధీ విగ్రహం’ సీఎం ఇన్నోవేటివ్ ఐడియానే.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు పెట్టాలనే ఇన్నోవేటివ్ ఐడియా ముఖ్యమంత్రిదని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం అంబేద్కర్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ దేశం గాంధీ కలలు కన్న విధంగా నడవాలని ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం రాజీవ్ గాంధీ చూపించారని అన్నారు. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు పంపించిన నేత రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు. నేడు మనం వాడుతున్న సెల్‌ఫోన్లు 1995, 96లో వచ్చాయన్నారు.

ఆనాడు రాజీవ్ గాంధీకి నెహ్రూ లాగా దూరదృష్టి లేకుండా ఉండి ఉంటే.. సెల్‌ఫోన్స్ అనేవి మనకు 2005వరకు వచ్చేవి కాదన్నారు. ఆయన కన్న కల ఈ దేశం సంకేతికపరిజ్ఞానం, కంప్యూటర్ పరంగా 21వ శతాబ్దానికి పోవాలని, పరిపూర్ణమైన టెక్నాలజీతో ముందుకు పోవాలని కలలు కన్నారని అన్నారు. ఆయన కల సాకారమైందన్నారు. సెక్రటేరియట్ ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం.. దశ దిశ నిర్దేశిస్తారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ భౌతికంగా లేకున్నా.. 18 ఏళ్లకు ఓటు హక్కు వచ్చిన ప్రతి వ్యక్తి, సర్పంచ్‌‌గా పని చేసిన ప్రతి వ్యక్తి, నీతి నిజాయితీగా చేయలనుకునే ప్రతి వ్యక్తి మదిలో ఉంటారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed