- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి.. కలెక్టర్
దిశ, కామారెడ్డి : కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం జరిగే ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పారు.
డీఆర్డీఓ, మెప్మా ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు మహిళలు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, మహిళలు, ప్రజలు కూర్చోవడానికి సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సీపీఓ రాజారామ్, డీఆర్డీఓ సురేందర్, జిల్లా వయో వృద్దుల, శిశు సంక్షేమ అధికారి బావయ్య, ట్రాన్స్కో ఎస్ఈ రమేష్ బాబు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.