- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి.. ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈనెల 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 న భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినప్పటికీ, తెలంగాణకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదన్నారు. హైదరాబాద్ సంస్థానంగా నిజాం నిరంకుశ నిర్బంధంలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించలేదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినా తెలంగాణను అవసరమైతే పాకిస్తాన్ లో కలుస్తామే తప్ప భారత్ లో కలవమని నిజాం అన్న మాటలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. నిజాం రాజు అన్న మాటలను సీరియస్ గా తీసుకున్న ఆనాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే అని ఆపరేషన్ పోలో నిర్వహించి పోలీస్ చర్య ద్వారా నిజాం మెడలు వంచి తెలంగాణను భారతదేశంలో కలిపిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ఉద్యమ సమయంలో డిమాండ్ చేసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ మాట మరిచిపోయాడన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణా విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథా కొనసాగిస్తోందని ధన్ పాల్ మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినాన్ని జరపమంటే ప్రజాపాలన అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ధన్ పాల్ దుయ్యబట్టారు. తెలంగాణ అమరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా సెప్టెంబర్ 17ను విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.