వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి

by Sridhar Babu |
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
X

దిశ, యాచారం : ప్రభుత్వ వైద్యులు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి 24 గంటలు అందుబాటులో ఉండాలని, లేకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శశాంక, డీసీహెచ్ఎస్ రాజు, ఆర్డీఓ అనంతరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఆసుపత్రిలోని వసతులపై ఆరా తీశారు. రోగులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు సరిగా లేకపోవడంతో మండిపడ్డారు. వైద్యుల గదులు, ల్యాబ్ రూంలు, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, నలుగురు ఎంబీబీఎస్​లు ఉన్నారని, మందుల కొరత లేదని అన్నారు. వర్షాకాలంలో శిథిలమైన భవనంతో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే మరమ్మతులు చేయనున్నట్లు తెలిపారు. కొన్ని టెస్టుల కోసం ప్రజలు నగరానికి వెళ్తున్నారని, సకల వసతులు కల్పించేలా కృషి చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అయ్యప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed