- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డిగ్రీ కాలేజీ బిల్డింగు లేక ఏడేండ్లాయే.. ఇంటర్ గదుల్లోనే డిగ్రీ క్లాసులు..
దిశ, ఇబ్రహీంపట్నం: ఏడేండ్ల క్రితం డిగ్రీ కాలేజీ బిల్డింగుకు అప్పటి మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కలిసి శంకుస్థాపన చేశారు. కానీ ఇంకా కూడా పూర్తి కాలేదు. ఏడేండ్లుగా ఇంటర్ కాలేజీ గదుల్లోనే డిగ్రీ స్టూడెంట్లకు క్లాసులు చెబుతున్నారు. దాంతో డిగ్రీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం వినోభానగర్ లో నూతనంగా నిర్మిస్తున్న డిగ్రీ కళాశాల భవనం ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఇంటర్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు పూర్తిస్థాయి తరగతులు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణం తో విద్యార్థులు ప్రైవేట్ డిగ్రీ కళాశాల లను ఆశ్రయించాల్సి వస్తోంది.
అక్కడ అధిక ఫీజులను భరించలేక విద్యార్థులు బెంబేలెత్తి పోతున్నారు. రూ.2.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2016 డిసెంబర్ లో మాజీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా డిగ్రీ కళా శాల భవనానికి శంకుస్థాపన చేయగా నేటికీ అందుబాటులోకి రాకపోవడంపై విద్యార్థు లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి వస్తుందా ? లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇంటర్, డిగ్రీకి సంబంధించి దాదాపు 1,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోధన జరుగుతోంది. దీంతో సరైన విద్య అందడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని, ల్యాబ్, లైబ్రరీ నిర్వహణకు గదులు కూడా లేవని విద్యార్థులు వాపోతున్నారు. కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టడంతో తరగతుల నిర్వహణ మరీ ఇబ్బందిగా మారిందంటున్నారు. శానిటేషన్ సమస్యతో పాటు కనీసం తాగునీరు లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని వినియోగలంలోకి తీసుకురావాలని కోరుతున్నాను. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించి 8 ఏళ్లు గడుస్తున్నా కళాశాల నేటికీ అందు బాటులోకి రాకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల గోస పట్టడం లేదు.
ఈ విద్యా సంవత్సరంలో కొత్త భవనం ప్రారంభించాలి..
ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ్
ఎన్నో సంవత్సరాలు పోరాటాలు చేస్తే ఇబ్రహీంపట్నానికి డిగ్రీ కళాశాల మంజూరైంది. కానీ విద్యార్థులకు కళాశాలను అందుబాటులో తీసుకురావడంలో, విద్యను అందించడంలో గత ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కొత్త భవనాన్ని ఈ విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకువచ్చి డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నూతన కళాశాల భవనాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.
జూనియర్ కాలేజీలో డిగ్రీ తరగతులు..
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పయ్యాంశెట్టి జగదీశ్
జూనియర్ కాలేజీ భవనంలో డిగ్రీ విద్యార్థులకు తరగతులు నిర్వహించడం వల్ల చాలీచాలని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్, లైబ్రరీ నిర్వహణకు గదులు కూడా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేద విద్యార్థులకు న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని పయ్యాంశెట్టి జగదీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.