ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కోతలు..

by Sumithra |
ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కోతలు..
X

దిశ, యాచారం : ఉపాధి హామీ చట్టానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో భారీగా కోతపెట్టింది. అంతే కాకుండా ఉపాధి హామీలో మార్పులు తెచ్చి సకాలంలో కూలి డబ్బులు ఇవ్వకుండా కూలీల బ్రతుకులతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల అంజయ్య అన్నారు. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో శనివారం ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా అంజయ్య మాట్లాడుతూ బీజేపీ కేంద్రప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి దేశవ్యాప్తంగా రూ.2లక్షల 50 వేల కోట్ల బడ్జెట్ అవసరముండగా, బడ్జెట్లో భారీగా కోత పెట్టి తగ్గించిందన్నారు. కూలీల సమ్మర్ అలవెన్స్ లను రద్దు చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిలో తెచ్చిన మార్పులు కూలీల బ్రతుకులు మార్పుకు ఉపయోగపడకుండ, కూలీల పొట్టకోట్టే విధంగా ఉన్నాయన్నారు. భవిషత్తులో క్రమంగా ఉపాధి పనిని తీసేయడం కోసమే ఈ మార్పులు తెచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ రమేష్, యాదయ్య, చెన్నయ్య, మహేందర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story