- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ ని కలుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
దిశ,మహేశ్వరం : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ని కలుస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీ సూరగిరి ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ...కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నాడన్నాడు. కేసీఆర్ చెప్పిన వారికే రాష్ట్రంలో మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు వస్తున్నాయన్నారు. కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ వకీల్ సాబ్‌గా పనిచేశారన్నారు. కేసీఆర్ చెప్పినందుకే తెలంగాణ రాష్ట్రం
నుంచి అభిషేక్ మను సింఘ్వీ కు తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలన్నారు. రాష్ట్రంలో విగ్రహాల లొల్లి మొదలైందన్నారు. రైతు రుణమాఫీ, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందన్నారు. హిందూ దేవాలయాలకు నిధులు కేటాయించడం లేదన్నారు. అభిషేక్ మను సింఘ్వీ కవిత బెయిల్ కోసం వకీల్ ఆ పనిచేయడం పై
కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి జోడు కుదిరిందన్నారు. దీనికి నిదర్శనం కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, తుక్కు గూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.