జోడో యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై కాంగ్రెస్ నేతల ధ్వజం..

by Sumithra |
జోడో యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై కాంగ్రెస్ నేతల ధ్వజం..
X

దిశ, తలకొండపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలకు పైగా కష్టపడి దేశంలోని ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను, స్వయం ప్రతి పత్తి గల సంస్థలను నిర్మించి కాపాడిందని, ఇందిరమ్మ ప్రభుత్వం మొత్తం దేశ అభ్యున్నతికి పెద్దపీట వేస్తే నేటి ప్రభుత్వాలు మాత్రం గాడి తప్పారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకుర్ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలంలోని గట్టు ఇప్పలపల్లిలో ఆదివారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకుర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి గడపగడపకు కరపత్రాలు పంపిణీ చేసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.

అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటై రాష్ట్రంలోని ప్రజలను మభ్యపెట్టే విధంగా నాటకాలు ఆడుతూ కనికట్టు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కిసాన్ సెల్ మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాటనరసింహ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జగన్, జిల్లా కార్యదర్శి గుజ్జుల మహేష్, నాయకులు అంజయ్య గుప్తా, అజీమ్, రవీందర్ యాదవ్, దశరథం, జనార్దన్ రెడ్డి, విష్ణు గౌడ్, అరీఫ్, చెన్నకేశవులు, రవీందర్ రెడ్డి, వెంకటయ్య, యాదయ్య, చంద్ర రెడ్డి, రామస్వామి, శేఖర్ రెడ్డి, రమేష్, మల్లారెడ్డి, వెంకటేష్, రవి, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story