టైలర్‌ కోసం విళారాలు.. కలిసి సేకరించిన కాలనీ వాసులు

by Disha News Desk |
టైలర్‌ కోసం విళారాలు.. కలిసి సేకరించిన కాలనీ వాసులు
X

దిశ, ఫరూక్ నగర్ : ఎవరికి ఏం జరిగినా మాకెందుకులే అనుకునే ప్రస్తుత పరిస్థితుల్లోనూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ వాసులు మాత్రం తమ ఉదారతను చాటుకున్నారు. ఇటీవల కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో టైలర్‌ షాపును కోల్పోయిన బాధితుడికి ఆర్థిక సహాయం అందించారు. రాం చందర్ యాదవ్ టైలర్ షాప్‌కు అండగా నిలిచేందుకు పద్మావతి కాలనీ వాసులు ముందుకొచ్చారు. కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకుడు నంద కిషోర్ మాధురి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు.

దాదాపు రూ.1లక్ష అయిన తర్వాత టీఆర్ఎస్ యువ నేత మురళీ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ చేతుల మీదుగా రాంచందర్ యాదవ్‌కు అందచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకట్రామిరెడ్డి, నంద కిషోర్ దాతలు బండారు రమేష్, స్నేహ మిత్ర బృందం, సభ్యులు నక్కల వెంకటేష్, వీరయ్య, వీరేశం, భషీర్, అందే భద్రప్ప, శివ కరుణాకర్, విద్యాసాగర్, కుమార్, సలీం, భువనేశ్వర్ (కాంట్రాక్టర్స్), నక్కల చిన్న మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story