కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం వల్లే చంద్రయాన్ 3 సక్సెస్- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి Bandi Sanjay

by Kalyani |   ( Updated:2023-08-23 16:48:40.0  )
కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం వల్లే చంద్రయాన్ 3 సక్సెస్- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి Bandi Sanjay
X

దిశ శంషాబాద్ : చంద్రయాన్ 3 సక్సెస్ వల్ల ప్రపంచమే భారత్ వైపు చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగానే చంద్రయంత్రి సక్సెస్ అయిందని సక్సెస్ కావడాన్ని భారతీయ జనతా పార్టీ సంతోషం వ్యక్తం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకునే దినోత్సవమన్నారు. ప్రపంచవ్యాప్తంగానే ఒక పండుగ వాతావరణ ఏర్పడిందన్నారు. దేశం ప్రపంచం మొత్తం ఒక టెన్షన్ వాతావరణంలో ఎదురుచూస్తున్న సందర్భంగా సేప్ ల్యాండింగ్ అవడం అందరిని సంతోషాన్ని గురిచేసిందన్నారు.

గతంలో రష్యా లాంటి దేశాలు సక్సెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డాయని అయినా అవి విఫలం అవడంతో ఈరోజు భారతదేశం సేప్ ల్యాండ్ చేసి ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. ఆర్థిక ప్రగతిలో ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశన్ని ఐదవ స్థానానికి తీసుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇస్రో శాస్త్రవేత్తలు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహించడం వల్లే సక్సెస్ సాధ్యమైందన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రేమ్ రాజ్, బుక్క వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి,బైతి శ్రీధర్, తోకల శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య, కొమురయ్య, శ్రీధర్, కుమార్ యాదవ్, బుక్క ప్రవీణ్, కొండ ప్రవీణ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, సునిగంటి సిద్దులు, మహేందర్, కిట్టు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More..

నిమిషాల్లోనే పని స్టార్ట్ చేసిన చంద్రయాన్-3.. అద్భుతమైన జాబిల్లి ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్ (ఫొటోలు)

చంద్రయాన్-3 సక్సెస్.. సిగ్గు పడుతున్న అంటూ సొంత దేశంపై విమర్శలు గుప్పించిన నటి

Advertisement

Next Story