శంషాబాద్ కు కేంద్ర భూ వనరుల బృందం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తనిఖీ

by Nagam Mallesh |   ( Updated:2024-08-17 15:02:24.0  )
శంషాబాద్ కు కేంద్ర భూ వనరుల బృందం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తనిఖీ
X

దిశ శంషాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ కు కేంద్ర భూ వనరుల బృందం వచ్చింది. శనివారం కేంద్ర భూ వనరుల విభాగం సెక్రెటరీ మనోజ్ జోషి, జాయింట్ సెక్రెటరీ కునాల్, రాష్ట్ర భూపరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ శశాంకలతో కలిసి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లాలో ధరణిలో వ్యవసాయ భూములకు సంబంధించి చేపడుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని శంషాబాద్ సబ్ రిజిస్టార్ కార్యాలయములో, వ్యవసాయేతర భూములకు సంబంధించి చేపడుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని తహశీల్దార్ కార్యాలయములో నవీన్ మిట్టల్ వివరించారు. రిజిస్ట్రేషన్ చేపడుతున్న సమయంలో ఏవైన ఇబ్బందులు, సమస్యలు తలెత్తినప్పుడు ఏవిధంగా పరిష్కరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, సబ్ రిజిస్టార్ రమాదేవి, తహశీల్దార్ రాములు, శంషాబాద్ డిప్యూటీ తాసిల్దార్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed