- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
'ఇచ్చిన హామీలను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు'
దిశ, ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి పాలన కొనసాగిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశిచంద్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని గడపగడపకు చేర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన హాత్ సే హాత్ జోడోయాత్రను ఆదివారం కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో ఏఐసీసీ నేత వంశీ చంద్ రెడ్డి ప్రారంభించారు. మైసిగండి మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను కరపత్రాల రూపంలో ప్రతి గడప గడపకు చేరవేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కల్పించారు.
రాష్ట్రంలో మద్దతు ధర లభించక, రుణమాఫీ కాక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్లు మాజీ జడ్పీటీసీ శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండల అధ్యక్షులు యాట నర్సింహా, మండ్లి రాములు, గుజ్జుల మహేష్, పాక్స్ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు బిక్య నాయక్, విజయ్ కుమార్, అనిల్, అంజయ్య, జహంగీర్, బిచ్య నాయక్, నరేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.