ఘనంగా ప్రారంభమైన బ్రహ్మొత్సవాలు..

by Sumithra |
ఘనంగా ప్రారంభమైన బ్రహ్మొత్సవాలు..
X

దిశ, పరిగి : పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 32వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యారు. పరిగి మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్​ కొప్పుల హరీశ్వర్​ రెడ్డి – గిరిజాదేవి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి ఆయన సతీమణి కొప్పుల ప్రతిమారెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు కొప్పుల అనిల్​ రెడ్డి– దీప్తి, జెడ్పీటీసీ దంపతులు బేతు ప్రవీణ్​ కుమార్​ రెడ్డి–హరిప్రియ మరి కొందరు దంపతులు యజ్జం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మంత్రోత్సవాలతో పరిగి పట్టణం మారుమోగింది.

నిత్యపూజ, మంగళహారతి అభిషేకం తదితర ప్రత్యేక పూజలతో యాగాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పరిగి మున్సిపల్​ చైర్మన్​ ముకుంద అశోక్​ కుమార్​, ఏఎంసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​, పీఏసీఎస్​ వైస్​ చైర్మన్​ శివన్నోళ్ల భాస్కర్​, మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story