- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్గానిక్ పంటలతో ఆరోగ్యం మెరుగు
దిశ, పరిగి : ఆర్గానిక్ పంటలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. పరిగి మండలం నజీరాబాద్–హనుమాన్ గండి శివారులో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పండిస్తున్న ఆర్గానిక్ పంటల సాగు విధానాన్ని బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ సాగు చేస్తున్న వరి, కూరగాయలు, చిరుధాన్యాల పంటలను పరిశీలించారు.
అనంతరం అక్కడ ఉన్న రైతులను పంటలు సాగు వివరాలు అడిగి తెసులుకున్నారు. సాగు చేస్తున్న పంట విధానం చాలా బాగుందని కితాబునిచ్చారు. రైతులకు సహకరిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులను అభినందించారు. ఆర్గానిక్ పద్ధతి ద్వారా పండించిన బియ్యం, కూరగాయలు విక్రయించేందుకు పరిగి మండల పరిషత్ కార్యాలయంలోని దుకాణ సముదాయాలను వాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు, ఎంపీడీఓ నజీర్, ఆర్ఐ , ఏఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.