- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుంది : ఆర్ఎస్పీ
దిశ, గండిపేట్: తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుందని, బహుజన రాజ్యం అంటే నిరుద్యోగుల రాజ్యం, విద్యార్థుల రాజ్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాబెల్ సిటీలో ఆర్ఎస్పీ తన నివాసంలో దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను, అర్థరాత్రి పోలీసు అధికారులు నిర్భందించారని దీక్ష, నిరసన చేయడం రాజ్యాంగ హక్కు అని ఆర్ఎస్పీ అన్నారు. కేసీఆర్ తాను చెప్పిందే రాజ్యాంగం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది బీఎస్పీ కార్యకర్తలను అరెస్టు చేశారని మండిపడ్డారు. మేము ఫాంహౌస్ కోసం ఆస్తుల కోసం రోడ్లపైకి రావడం లేదని ఎద్దేవా చేశారు.
విద్యార్థుల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, నిరుద్యోగుల సమస్యలపై సీఎం కూడా సమాధానం చెప్పడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఆకాంక్షల మేరకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరారు. ఒకే అభ్యర్థి ఒకే రోజు ఇన్ని పరీక్షలు ఎలా రాస్తాడని ప్రశ్నించారు. పోటీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలని అన్నారు. గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిలబస్ మార్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మారిన సిలబస్ కు ఇప్పటి వరకు మెటీరియల్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై శాంతియుతంగా పోరాడితే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిలబస్ మార్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మారిన సిలబస్ కు ఇప్పటి వరకు మెటీరియల్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తామంతా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నామని చెప్పారు.
సామాన్యులు, ఇతర పార్టీల నేతలు సమస్యలపై పోరాడితే మాత్రం అరెస్ట్ చేస్తారని.. మంత్రులు రోడ్లపైకి వస్తే ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం... విపక్షాలకు ఒక న్యాయమా అని నిలదీశారు. పేపర్ లీకేజీలపై వేసిన సిట్ ఇంత వరకు రిపోర్టు ఇవ్వలేదన్నారు. విద్యార్థులపై ఖర్చు చేయాల్సిన డబ్బు కాళేశ్వరం, ప్రగతిభవన్ పై ఖర్చు చేశారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షను విరమించారు.