- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాదయాత్రల జోరు.. ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో పార్టీల తర్జన భర్జన
దిశ, శేరిలింగంపల్లి : ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా తాము రెడీ అంటున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ నేతలు. అందులో భాగంగా ఇప్పటి నుండే ఓటర్లకు దగ్గరయ్యేందుకు పాదయాత్రలు మొదలు పెట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఈ పార్టీ ఆపార్టీ అనే తేడా లేకుండా యాత్రల పేరుతో ఇంటింటికి తిరిగుతున్నారు నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ ఏడాది గడువు ఉండగానే పాదయాత్రలతో ఇంటింటికి తిరిగేస్తున్నారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా చేస్తున్న పాదయాత్రలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంకా చాలా సమయం ఉన్నా నాయకులు ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారన్నదానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది. కానీ పార్టీ నేతల తీరుతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది.
ఇంటింటికి పాదయాత్ర
అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అభివృద్ధి ఫలాలు అందరికి. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం అంటూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలోనూ పాదయాత్రలు చేస్తున్నారు. పార్టీ ఆదేశాలతో కొండాపూర్ డివిజన్ మినహా మిగతా 9 డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి మరోసారి అభివృద్ధి గూర్చి అందరికి విడమరిచి చెప్పడమే కాకుండా చేసిన పనులు, ఇచ్చిన హామీలను నెరవేర్చిన వైనాన్ని ప్రతీ ఇంటికి చేరేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో అందరికి అభివృద్ధి ఫలాలు అందేలా తాము ఇప్పటి వరకు చేసిన పనులను సవివరంగా వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.
ఇక ప్రతిపక్ష బీజేపీకి చెందిన రవికుమార్ యాదవ్ ఇంటింటికి బీజేపీ పేరుతో శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్వీన్ కాలనీ డివిజన్ లో పాదయాత్ర చేస్తున్నారు. అధికార బీఆర్ ఎస్ పార్టీ అభివృద్ధి గూర్చి పాదయాత్ర చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం అధికార పార్టీ చేసింది ఏమీ లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పాదయాత్రలో బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం స్థబ్దుగా ఉన్నారని, టికెట్ ఆశావహులుగా చెప్పుకుంటున్న వారు కూడా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టడం లేదని ఆపార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఇక ఇన్నాళ్లు ఎలాంటి హడావుడి లేకుండా మిన్నకున్న టీడీపీ నాయకులు సైతం ఇప్పుడు ఇంటింటికి టీడీపీ పేరుతో నియోజకవర్గంలో పాదయాత్రలు మొదలు పెట్టారు. వామపక్షాలు, బీఎస్పీ లాంటి పార్టీలు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నాయి.
అప్పుడే హడావుడి
అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్, లేదా నవంబర్ నెలలో ఉండవచ్చని ఇటీవల రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నాయకులు అలర్ట్ అయినట్లు కనిపిస్తుంది. పాదయాత్రల పేరుతో నాయకులు హడావుడి చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమే అంటున్నాయి అన్ని పార్టీలు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు వెళుతున్నాయి. పార్టీలు మారాలని చూస్తున్న ఛోటామోటా నాయకులను కూడా కండువాలు కప్పి ఆహ్వానిస్తూ అందరినీ కలుపుకు పోతున్నాయి. అన్ని పార్టీలు కూడా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రలు చేస్తున్నా ప్రజల ఆదరణ ఎవరికి ఉంటుంది అన్నది కాలమే నిర్ణయించాలి.