ఖానాపూర్ లో కసిరెడ్డి మకాం కలిసి వచ్చిందా !

by Sumithra |
ఖానాపూర్ లో కసిరెడ్డి మకాం కలిసి వచ్చిందా !
X

దిశ, తలకొండపల్లి : నవంబర్ 30న జరిగే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కల్వకుర్తిలోని కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకు అన్యుహంగా పుంజుకుంటుంది. తలకొండపల్లి మండలంలోని కసిరెడ్డి సొంత గ్రామమైన ఖానాపూర్ లో గత పది రోజులుగా ఇక్కడే మకాం వేయడంతో ఓటర్లు నేరుగా వచ్చి పెద్ద సంఖ్యలో కలుస్తున్నారు. నియోజకవర్గంలోని ఖానాపూర్ గ్రామం మద్యస్థంగా ఉండడంతో పరిసర మండలాలైన కడ్తాల్, మాడుగుల, చారగొండ, వెల్దండ, కల్వకుర్తి మండలాలలోని పలుగ్రామాల నుండి స్థానిక నేతల ప్రమేయం లేకుండా నేరుగా ఓటరు మహాశయులే వచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి బారులు తీరుతుండడంతో కాంగ్రెస్ కు పూర్వవైభవం రావడం ఖాయమని కాంగ్రెస్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో చేరడానికి వచ్చిన కార్యకర్తలు గంటల తరబడి వేచి ఉండడం చూస్తుంటే విజయ దుందుభి ఏ స్థాయిలో ఉంటుందోనని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంచనాలు వేయలేకపోతున్నారు.

అధికార బీఆర్ఎస్ పార్టీతో కల్వకుర్తి అభివృద్ధికి నోచుకోలేదని ప్రజల చేరికలే బలం చేకూరుస్తున్నాయి. మంగళవారం రాత్రి తలకొండపల్లి మండలంలోని, మెదక్ పల్లి, పడమటి తండా, తాళ్లగుట్ట తండా, ఎడవెల్లి, చుక్కాపూర్ ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విటాయిపల్లి నుండి భారీ ఎత్తున అధికార బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరిన ప్రతి కార్యకర్త ఒక సైనికుల కృషి చేయాలని, కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ చేతి గుర్తుకు ఓట్లు వేయించాలని, కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పెద్దలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed