అమిత్ షా సభను విజయవంతం చేయాలి.. ఓబీసీ కన్వీనర్ వెంకటేష్ గౌడ్

by Sumithra |
అమిత్ షా సభను విజయవంతం చేయాలి.. ఓబీసీ కన్వీనర్ వెంకటేష్ గౌడ్
X

దిశ, మొయినాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సెంటిమెంట్ గా పేరు పొందిన చేవెళ్ల నియోజకవర్గంలో మొట్టమొదటి సారిగా వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బారీ బహిరంగ సభను విజవంతం చేయాలని ఓబీసీ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో నేడు 23న చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. అమిత్ షా సభను చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకుని పోయి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేవిధంగా సభ ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర పథకాలు అండగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు నష్టపోతున్నారని రానున్నరోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మేలు చేస్తాయని అన్నారు. చేవెళ్ల గడ్డ అంటేనే బీజేపీ అడ్డాగా ఈ విధంగా అధిక సంఖ్యలో గ్రామీణ ప్రాంత ప్రజలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story