- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్..
దిశ, శంషాబాద్ : అక్రమ సంబంధం బయట పడుతుందని ఓ మహిళను హత్య చేసిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గత ఆరురోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో రామంజపూర్ నార్ల పద్మ (45) అనే మహిళ మృతదేహం లభించిన విషయం అందరికీ తెలిసిందే. కాగా పోలీసులు దాన్ని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తూ మృతురాలి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
దాని ఆధారంగానే శంషాబాద్ మండలం రామంజపూర్ గ్రామానికి చెందిన కత్తుల రాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని విచారించగా మృతురాలు పద్మకు, కత్తుల రాజుకు గత ఆరు నెలల నుండి పరిచయం ఉందని తేలింది. ఆ పరిచయంతోనే డబ్బులు ఇస్తానని చెప్పి శారీరకంగా కలిసినట్లు తెలిపారు. ఇద్దరూ కలిసిన తరువాత నిందితుడు మృతురాలు పద్మకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె కత్తుల రాజును బూతు మాటలు తిట్టిందని తెలిపారు. ఆ తరువాత కొన్ని రోజులుగా వారిద్దరూ మాట్లాడుకోకుండా ఉన్నారన్నారు. అనంతరం కొన్నిరోజుల తర్వాత మృతురాలు పద్మ ఫోన్ చేసి డబ్బులు అడగడంతో బయటికి వస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పాడని తెలిపారు.
దీనికి అంగీకరించిన పద్మ గత నెల 19వ తేదీన రాత్రి ఏడు గంటలకు బయటికి రాగా నిందితుడు ఒక బీరు బాటిల్ కొనుక్కొని తన బైక్ (AP 28 AT 8917) పై ఎక్కించుకొని మల్కారం గ్రామ శివారులోని మధుపాల వెంచర్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించి పద్మను బలవంతం చేయబోతుండగా తాను అడ్డుకొని డబ్బులు అడిగిందన్నారు. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి బలవంతంగా అత్యాచారం చేశాడని తెలిపారు. మృతురాలు గట్టిగా అరుస్తూ ఊర్లోకి వెళ్లి అందరికి చెప్తాననడంతో నిందితుడు బెదిరిపోయి ఆమెను అడ్డుకున్నట్టు తెలిపారు. అనంతరం కిందపడేసి బలవంతంగా తన చీరతోనే తన మెడకు చుట్టి గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు రాజును బుధవారం రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్ పెక్టర్ శ్రీధర్ కుమార్ తెలిపారు.