కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్

by Kalyani |
కిడ్నాప్ కేసులో నిందితులు అరెస్ట్
X

దిశ, ఆమనగల్లు(కడ్తాల్)::- వ్యాపార లావాదేవీల కారణంగా ప్రముఖ మైనింగ్ వ్యాపారి, రియాల్టర్ కతల్ ను కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్లు కడ్తాల్ సీఐ శివప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి జిల్లా పానగల్లు మండలం రేమద్దుల గ్రామానికి చెందిన కతల్ (43)హైదరాబాద్ లో నివాసం ఉంటూ, రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈనెల 5న తన కుమారుడు, బావమరిది తో కలిసి తనపై ఉన్న కేసు విషయ పై వెల్డండ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వైపు వస్తుండగా మార్గమధ్యలో కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద కొంత మంది యువకులు కతల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడి చేసి, ఆయనను బయటకు లాగి, విచక్షణారహితంగా దాడి చేసి, కిడ్నాప్ చేశారు.

ఈ సంఘటనపై కతల్ కుమారుడు శ్యాంసుందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నిందితులలో మాడ్గుల మండలం చంద్రయాన్ పల్లికి చెందిన అన్వేష్(25),సురేష్(27), వెల్డండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నిజాం ఉద్దీన్(31),అఫ్రోజ్(27)లను ఈ నెల 6న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వెల్దండ మండలం పోతపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ కుమార్(43), బర్కత్ పల్లి గ్రామానికి చెందిన(25)లను సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed