- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గనిలో మగ్గుతున్న బాల్యం
దిశ, తాండూరు : చదువు, ఆట పాటలతో హాయిగా బడిలో గడపాల్సిన బాల్యం అందుకు విరుద్ధంగా నాపరాతి గని పనిలో మగ్గుతున్న పట్టించుకునే నాధుడే లేదని చూసిన వారు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ నాపరాతి గని భూములలో బషీరాబాద్ చెందిన వడ్డే వెంకటేశం దర్జాగా అక్రమ మైనింగ్ చేస్తున్నాడు.అక్రమ మైనింగ్ చేస్తూ.. బాల కార్మికుల చేత బండల పని చేస్తున్నాడు. ఒకవైపు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వాలు అనేక సంస్కరణలు చేపడుతుంటే,వాటిని అమలు చేయడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాల కార్మికుని గనిలో పనిచేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకుని ఆ బాలుడిని బడిలో చేర్పించి బాలుడికి బంగారు భవిష్యత్ ఉండేలా చూడాలని పలుకులు కోరుతున్నారు.