ప్రజావాణికి 67 ఫిర్యాదులు

by Kalyani |
ప్రజావాణికి 67 ఫిర్యాదులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ– 52,ఇతర శాఖలకు–15, మొత్తం 67 దరఖస్తులు అందాయి.

అనంతరం జిల్లా కలెక్టర్ సి,నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారీగా సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వేను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటింటి సర్వేను ఒక ప్రణాళిక పరంగా నిర్వహించాలని, మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, తప్పిదాలకు తావు లేకుండా వివరాలను సేకరిస్తూ ఆన్లైన్ యాప్ లో నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా, పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతనంగా ప్రవేశపెట్టిన డైట్ ను సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని రకాల పాఠశాలలో అమలు జరిగేలా ప్రతి ఒక్కరు పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed