- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shruti Haasan: సూపర్ స్టార్ సినిమా సెట్ నుంచి ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన శృతి హాసన్..
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’(Coolie) చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తుండగా.. సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను కళానిధి మారన్(Kalanidhi Maran) నిర్మిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్‌కి వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ ‘కూలీ’ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు.
ఇందులో అక్కినేని నాగార్జున(Nagarjuna), సత్యరాజ్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్(Soubin Shahir) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, శృతి హాసన్ షూటింగ్ సెట్స్ నుంచి రెండు ఫొటోలు షేర్ చేసి హైప్ పెంచింది. సెట్స్‌లో బైక్‌పై కూర్చుని అదిరిపోయే లుక్స్‌తో అందరినీ ఫిదా అయ్యేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో రజినీకాంత్(Rajinikanth ), శృతి మధ్య సాగే సన్నివేశాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.