- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్ల మరమ్మతులకు కేంద్ర సాయం నిల్.. నేటికీ విడుదల కాని నిధులు
దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. వరదల ధాటికి స్టేట్ వైడ్‌గా సుమారు మూడు వేల కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో కల్వర్టులు కొట్టుకుపోయాయి. నష్టాన్ని అంచనా వేసిన రోడ్లు, భవనాల శాఖ అధికారులు వాటికి సంబంధించిన వివరాలన్నీ జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా కేంద్రానికి నివేదించారు. కేంద్ర బృందం వచ్చి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి వెళ్లిందని, కానీ నేటి వరకూ నిధులు రాలేదని ఆర్అండ్‌బీ అధికారులు చెబుతున్నారు.
రూ.10 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
భారీ వర్షాలతో పలు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లను కేంద్ర బృందం వచ్చి పరిశీలించింది. తక్షణ ఆర్థిక సాయం చేయాలని సంబంధిత అధికారులు.. బృందానికి నివేదించారు. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయమూ అందలేదని ఆఫీసర్లు తెలిపారు. కేంద్రంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందుగా తక్షణ మరమ్మతుల కోసం రూ.10 కోట్లు కేటాయించిందని ఆఫీసర్లు పేర్కొన్నారు. అయితే వర్షాలతో కొన్ని రోడ్లు కోతకు గురయ్యాయని, వీటికి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కోతకు గురైన కొన్ని రోడ్ల మరమ్మతులకే సుమారు రూ.498.24 కోట్లు ఖర్చవుతాయని రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లు చెబుతున్నారు.ః
తాత్కాలిక మరమ్మతులు తప్పనిసరి: రవీందర్‌రావు, ఆర్‌అండ్‌బీ, ఈఎన్‌సీ
భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడువేల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించాం. మరమ్మతులు చేసేందుకు సుమారు రూ.1,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశాం. అక్టోబర్‌లో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి సాయం కోసం నివేదిక సమర్పించాం. కానీ నేటి వరకూ నిధులు విడుదల కాలేదు. నిధులు ఉంటే జనవరిలో పనులు ప్రారంభించి మే 31లోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.