- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురు జ్ఞాపకాలతో ఓ తండ్రి కథ...!
దిశ, ఏదుల: పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగిన అందరికన్నా ఎక్కువగా గర్వపడేది, ఆనందపడేది తండ్రి మాత్రమే. ఆరోజు కోసమే తన జీవితాంతం దార పోసేస్తాడు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్న నీకు నేనున్నాను అని వెనుక నిలిచేది నాన మాత్రమే. అలాగే నువ్వు గెలిచినప్పుడు పదిమందికి గర్వంగా చెప్పుకునేది ఆనందపడేది నాన్న ఒక్కరే. ఒక బిడ్డకి నాన్న మనసు తాను నాన్న అయినప్పుడే అర్థం అవుతుంది. కొడుకులు తల్లిదండ్రులను వదిలేసిన రోజులు ఉన్నాయి కానీ కూతుర్లు మాత్రం హక్కుల చేసుకుని రోజులు చాలానే ఉన్నాయి. వనపర్తి జిల్లా ఎద్దుల మండల కేంద్రానికి చెందిన ఓ తండ్రి తన కూతురు లివర్ ప్రాబ్లం తో చనిపోయిన జ్ఞాపకాలతో బ్రతుకుతూ పేదవారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ మీకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వాళ్ళ చిరునవ్వును తన కూతురిని చూసుకుంటూ మురిసి పోతున్న ఓ తండ్రి కథ..
తండ్రి కూతుర్ల ఆప్యాయత పలకరింపులు..
*నాన్న స్కూల్ కి వెళ్ళాలి నాకు పుస్తకాలు ఇప్పించు..
*పుట్టిన క్షణాన మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయే తండ్రి సంతోషం
*తల్లి మందలించినప్పుడు పరుగు పరుగున తండ్రి కౌగిలి లోకి వెళ్లి తలదాచుకునే చిలిపి తల్లి కూతురు
*కూతురు పై చాడీలు చెప్పిన తల్లి.. అలా కాదు నా కూతురు బంగారు తల్లి అని వెనక్కి వేసుకొచ్చే తండ్రి
*పెద్దయ్యాక భాగం చదువుకొని ధైర్యంగా ఉండాలని కూతురుకు నచ్చజెప్పి తండ్రి..
వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రం చెందిన రాము యాదవ్ అనే జి హెచ్ ఎం సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తాన్నాడు. తన చిన్న కూతురు హరిత అనే అమ్మాయి లివర్ ప్రాబ్లం తో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చనిపోవడం జరిగింది. తనకు గుర్తుగా ఆమె పేరుతో హరిత ఫౌండేషన్ నిర్వహించి 500 పైగా ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
‘దిశ’ దినపత్రికతో స్పెషల్ ఇంటర్వ్యూ..
దిశ : మీ పేరు కుటుంబం నేపథ్యం మీరు ఏం పని చేస్తారు…
రాము : నా పేరు రాము యాదవ్ నేను హైదరాబాదులోని కాంట్రాక్టర్, మేస్త్రి పని చేస్తుంటాను మా అమ్మ నాన్న లేబర్ పని చేస్తూ ఉండేవారు ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపు తున్నాం
దిశ: ఉచిత కంటి వైద్యం ఆపరేషన్ చేయించలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది
రాము : నేను నెలలో వారం 10 రోజుల పాటు మా గ్రామమైన ఏదుల మండల కేంద్రానికి వచ్చేవాడిని. గ్రామాలను కొంతమంది నాయనా పేద ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేయొచ్చుగా అని నన్ను అడగడం జరిగింది. వారి సహకారంతో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు కాబట్టి ఆ ప్రపంచాన్ని చూసే గొప్ప శక్తి ఉన్న కన్ను సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. వారికి ఉచిత కంటి వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను.
దిశ: హరిత ఎవరు? హరిత ఫౌండేషన్ పెట్టాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది.
రాము : నా చిన్న కూతురు హరిత లివర్ ప్రాబ్లం తో గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. తన ఆలోచనలకు గుర్తుగా ఆమె పేరు మీద ఈ ఫౌండేషన్ నిర్వహించి పేద ప్రజలకు ఉచిత వైద్యం చేయిస్తున్నాను.
దిశ : ఇప్పటివరకు ఎంతమందికి ఉచిత వైద్యం చేయించారు వారి నుండి వచ్చే స్పందన ఏంటి?
రాము : 2023 డిసెంబర్ నుండి ఈ క్యాంపు నిర్వహిస్తున్న ఇప్పటివరకు 500కు పైగా మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయిస్తున్నాను. వారి నుండి మంచి స్పందన వచ్చి చిరునవ్వుతో వెళుతున్నారు. వారి చిరునవ్వులు నా కూతురిని చూసుకుని మురిసిపోతున్నాను.
దిశ : చివరగా మా ‘దిశ’ దినపత్రిక ద్వారా మీ హరిత ఫౌండేషన్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు
రాము : నాకు శక్తి ఉన్నంతవరకు నా కూతురు పేరు మీద ఉన్న ఈ హరిత ఫౌండేషన్ అని కొనసాగిస్తాను పేద ప్రజలకు సేవ చేస్తాను. దిశ, దినపత్రిక యజమాన్యానికి ఎప్పటికప్పుడు వార్తలు దిశ దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు.
కంటి వైద్య కోసం వచ్చిన వారి నుంచి స్పందన..
మేము చాలా దూరం నుండి వస్తున్నాను ఆటో ద్వారా మా గ్రామంలో తిరిగితే వెంటనే ఫోన్ ద్వారా సంప్రదించి ఇక్కడికి వచ్చాము ఇక్కడ మాకు అంతా ఉచితంగా వైద్యం చేస్తున్నారు ఈ హరితపాండేషన్ కి కృతజ్ఞతలు.