TG Assembly: అప్పులు చేస్తూ.. మాకు నీతి సూత్రాల: డిప్యూటీ సీఎంపై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-12-17 06:21:15.0  )
TG Assembly: అప్పులు చేస్తూ.. మాకు నీతి సూత్రాల: డిప్యూటీ సీఎంపై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అప్పులపై తెలంగాణ అసెంబ్లీ (Assembly)లో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి (Deputy CM Mallu Bhatti Vikramarka) విక్రమార్క అసెంబ్లీ (Assembly)లో కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యుడు హరీశ్ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. సభలో భట్టి విక్రమార్క ఆవేశంతో మాట్లాడుతూ.. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఓ వైపు అప్పులు చేస్తూనే మాకు నీతి సూత్రాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఏడాది పాలనలోనే రూ.1.27 వేల కోట్ల అప్పు చేసిందని ఫైర్ అయ్యారు. ఈ లెక్కన రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం రూ.6.36 వేల కోట్ల అప్పు చేయబోతోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రూ.4.47 లక్షల కోట్ల అప్పు ఉంటే.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టుగా చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే తాము రాష్ట్ర అప్పులపై ప్రివిలేజ్ మోషన్ (Privilege Motion) ఇచ్చామని స్పష్టం చేశారు. అయితే, తాము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌పై ఈ సమావేశాల్లోనే చర్చ పెట్టాలని హరీశ్ రావు (Harish Rao డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed