Hydra: ఆ నిర్మాణాల జోలికి వెళ్లం.. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

by Ramesh Goud |   ( Updated:2024-12-17 09:11:06.0  )
Hydra: ఆ నిర్మాణాల జోలికి వెళ్లం.. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా(Hydra) ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) క్లారిటీ(clarity) ఇచ్చారు. ఇవాళ హైడ్రా బృందం మూసాపేట ప్రాంతంలోని కాముని చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేతలపై(Demolitions) హైడ్రా మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని(False propaganda) ఖండించారు. హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని, జూలై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను తప్పక కూల్చివేస్తామని స్పష్టం చేశారు. అలాగే గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లమని, ఎలాంటి అనుమతలు లేకుండా నిర్మిస్తున్న వాటిపై హైడ్రా కూల్చివేస్తుందని చెప్పారు. అలాగే ఇటీవల కాలంలో తీసుకున్న అనుమతులు హైడ్రా తనిఖీలు చేస్తుందని వాటిల్లో లోపాలు ఉంటే ఆ నిర్మాణాలను అడ్డుకుంటామని తెలిపారు. ఇక ప్రభుత్వ విధానాలకు(Government Policies) అనుగుణంగా చెరువుల పరిరక్షణకు(Conservation Of Ponds) హైడ్రా పని చేస్తుందని అన్నారు. హైడ్రా పేదవాళ్లు, చిన్న వాళ్ల జోలికి రాదని, పేదవాళ్ల ఇండ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దని రంగనాథ్ సూచించారు.

Advertisement

Next Story