పార్లమెంట్ చరిత్రలో మొదటి సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్.. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడానికి లోక్ సభ ఆమోదం

by Mahesh |
పార్లమెంట్ చరిత్రలో మొదటి సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్.. జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశ పెట్టడానికి లోక్ సభ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభలో ఈ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాలే(Arjun Ram Meghwal) జమిలి ఎన్నిక బిల్లును ప్రవేశ పెట్టారు. కాగా ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగ్గా.. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఖండించగా.. ఎన్డీఏ మిత్రపక్షాలు(NDA allies) మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లును జేపీసీ(JPC)కి పంపండానికి సభ్యులు డివిజన్ కోరారు. దీంతో కొత్త పార్లమెంట్ లో తొలిసారిగా ఎలాక్రానిక్ ఓటింగ్(Electronic voting) గ్వారా డివిజన్ పద్దతిని ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఓటింగ్ విధానం పై లోక్ సభ అధికారి సభలోని సభ్యులకు అర్థం అయ్యే విధంగా ఇంగ్లీష్ హిందీ భాషల్లో వివరణ ఇచ్చారు. అనంతర ఈ ఓటింగ్ జరగ్గా.. 369 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గోనగ.. 220 మంది సభ్యులు డివిజన్ కు ఎస్ చెప్పాచారు. అలాగే 149 మంది సభ్యులు నో చెప్పారు. కాగా కొన్ని సీట్లలో సాంకేతిక లోపాలు రావడం తో సభ్యులకు స్లిప్పులు(Slips) అందజేశారు. దీంతో మొత్తం ఓటింగ్ ముగిసే సమయానికి ఈ బిల్లుకు మద్దతుగా 269 మంది సభ్యులు నిలవగా.. వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. దీంతో జమిలి బిల్లను ప్రవేశ పెట్టడానికి లోక్ సభ ఆమోదం(Approval of Lok Sabha) తెలిపింది. అనంతరం కేంద్ర మంత్రి బిల్లును ప్రవేశ పెట్టగా లోక్ సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా(Speaker Ombirla) చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed