- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతన్న బతుకు భారం అవుతున్న వేళ.. కరువైన చేయూత
దిశ, రాజోలి : భారతదేశంలో అతి ప్రాచీన పరిశ్రమ అయిన ఈ చేనేత వృత్తి కారణంగా ఒకప్పుడు దేశానికి పేరు, డబ్బు తెచ్చి పెట్టింది. వందల ఏళ్ల క్రితం నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత చేనేతది. ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కి ఎగుమతి చేయబడ్డాయి. మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాల్లో ఉంది దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కాలానికి అనుగుణంగా మార్పులు వస్తున్నా కార్మికుల ఆకలి తీర్చడం లేదు.
గద్వాల చీరకు పెట్టింది పేరు...
గద్వాల చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది నైపుణ్యంతో కూడిన నేత విధానంలో నూలు, పట్టు, సికో, కోటకొమ్మ, జరి లతో రూపొందించిన గద్వాల్ చీరలు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ డిజైన్లు వస్త్ర ప్రేమికుల్ని కట్టిపడేస్తున్నాయి పండుగలు పెళ్లిళ్ల సీజన్లో అయితే గద్వాల చీరలు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి. చీర డిజైన్ మరియు రంగులను బట్టి ఒక్కో చీర రూ.పదివేల నుంచి లక్ష వరకు ధరలు పలుకుతున్నాయి .
విదేశాలతో పాటు దేశ నలుమూలల మంచి డిమాండ్ ...
విదేశాలతో పాటు పూణే, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రముఖ నగరాల్లో వీటికి బారి డిమాండ్ ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల, రాజోలి, ఐజ, ఏ క్లాస్ పూర్, గొర్ల కన్ దొడ్డి, గట్టు, మాచర్ల, అరగిద్ద, అలంపూర్, వనపర్తి, సహా ప్రాంతాల్లో గద్వాల్ చీరలు తయారు చేస్తారు.
పెట్టుబడి, నైపుణ్యత కరువు..
చేనేత కార్మికులు సొంతంగా ముడి సరుకు కొని చీరను తయారు చేయడానికి పెట్టుబడి, మార్కెటింగ్ చేసే నైపుణ్యం లేక మాస్టర్ వీవర్స్ నుండి ముడి సరుకు తీసుకొని చీరను తయారు చేసిన మాస్టర్ వీవర్స్ కు అందజేస్తున్నారు.
కనుమరుగు దిశగా చేనేత సహకార సంఘాలు....
ఇక చేనేత కార్మిక ఉపాధి కల్పించి వారికి ఆదాయం అందించాల్సిన చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం రెండు మూడు సంఘాలు తప్ప మిగిలినవి దాదాపు మనుగడ లేవు. దీంతో సొసైటీలు చేనేత కార్మికులకు పని కల్పించే పరిస్థితి లేదు.
ఎవరి లోపం..?
గద్వాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాస్టర్ వివర్లు ఉమ్మడి పెట్టుబడితో ప్రారంభం కావాల్సిన చేనేత పార్క్ శంకుస్థాపనకే పరిమితమైంది గద్వాల మండలం పూడూరు సమీపంలో సమగ్ర చేనేత పార్క్ ఏర్పాటు కోసం 47 ఎకరాల స్థలం కేటాయించారు తొలుత పది ఎకరాల స్థలంలో చేనేత వస్త్రాల తయారీకి అవసరమైన అన్ని విభాగాల భవనాలు మౌలిక సదుపాయాలు వసతులు పరికరాలు ఏర్పాటు చేయాలని భావించారు 14 కోట్ల 98 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ 6 కోట్ల రూపాయలు, గద్వాలలో మాస్టర్ వీవర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ SPV గా ఏర్పడి నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఇవ్వాల్సి ఉంటుంది అందుకోసం సుమారు 24 మంది మాస్టర్ రివర్స్ ముందుకు వచ్చారు కానీ పార్క్ యాజమాన్య హక్కులు SPV కి కల్పించాలని వారు డిమాండ్ చేయడంతో అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు దీంతో ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్ ఆమోదం కోసం ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉంది.
పథకల పై నీలి నీడలు...
ప్రస్తుతం చేనతరంగా మనుగడ ప్రశ్నర్ధకమవుతున్న వేళ గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్మికులను కొద్దో గొప్పో ఆదుకున్నాయి. త్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా చేనేత కార్మికుడు నెలవారీగా అర్జించే ఆదాయంలో 8% బ్యాంకు ఖాతాలో RD 1 లో జమ చేస్తే సర్కారు 16% డబ్బులు అతడు ఖాతాలో RD2 రూపంలో జమ చేస్తుంది ఇలా మూడేళ్ల తర్వాత దాచుకున్న డబ్బులను తిరిగి తీసుకోవచ్చు ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బు కార్మికులకు ఎంతగానో ఉపయోగపడింది. చేనేత మిత్ర అనే పథకం ద్వారా రేషం కొనుగోలుపై 40% సబ్సిడీని నేరుగా చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం ఈ పథకలను తిరిగి ప్రారంభించక పోవడంతో కార్మికుల్లో ఆందోళన మరియు అయోమయానికి గురవుతున్నారు. అభయ హస్తం పై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన దీనిపైన ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. తరగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.