- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sonakshi Sinha: మా నాన్న పెంపకాన్ని తప్పు పట్టకండి.. నటుడికి సోనాక్షి మాస్ వార్నింగ్ (పోస్ట్)
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) నటుడు ముఖేష్ ఖన్నాకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ నోట్ షేర్ చేసింది. తన తండ్రి పెంపకాన్ని తప్పుపట్టొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయంలోకి వెళితే.. సోనాక్షి సిన్హా గతంలో కేబీసీ(KBC) అనే షోలో పాల్గొంది. అయితే అక్కడ రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. ఆంజనేయుడు ఎవరి కోసం సంజీవని తీసుకొస్తాడు అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది.
ఇది చాలా ఏళ్ల కిందట జరిగిన సంఘటన అయినప్పటికీ బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా(Mukesh Khanna) పదే పదే గుర్తు చేస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోనాక్షి స్పందించింది. ‘‘డియర్ ముఖేష్ ఖన్నా జీ నేను చాలా సంవత్సరాల క్రితం హాజరైన షోలో రామాయణ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. అందరికీ అన్ని గుర్తుంటాయని చెప్పలేం. అవి తెలిసినా ఆ సమయంలో సమాధానాలు గుర్తుకు రావేమే. కేబీసీ షోలో పాల్గొన్నప్పుడు నాతో పాటు ఇద్దరు ఉన్నారు. వాళ్లు కూడా ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేకపోయారు.
కానీ మీకు మాత్రం నేను ఒక్కదాన్ని మాత్రమే కనిపిస్తున్నాను. అయినా అది ఎప్పుడో జరిగిపోయింది. మీరు పదే పదే దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు. రామాయణంలో రాముడు మంధర, కైకేయి, రావణుడిని కూడా క్షమించాడు. మీరు కూడా నన్ను క్షమించవచ్చు.. అలా అని నేను మీ క్షమాపణలు ఏమీ కోరుకోవడం లేదు. మా నాన్న పెంపకం గురించి తప్పుగా మాట్లాడకండి. ఆయన పద్దతులను నేర్పించడంతో పాటు చక్కగా పెంచాడు. అందుకే శాంతంగా, నిదానంగా సుతిమెత్తంగా మీ అందరికీ సమాధానం ఇస్తున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ సోనాక్షి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.