- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారని వ్యక్తి ఆత్మహత్య..మూతపడిన ఇందిరా ఇండెన్ గ్యాస్
దిశ, కూసుమంచి: అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలంలో ఆలస్యంగా చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండల కేంద్రానికి చెందిన షేక్ నాగుల్ మీరా (40) కూసుమంచి మండల కేంద్రంలోని ఇందిరా ఇండెన్ గ్యాస్ ఏజెన్సీలో గత 12 ఏండ్లుగా డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఈ క్రమంలో ఇండెన్ గ్యాస్ యాజమాన్యం సిబ్బంది చెప్పుడు మాటలతో తనని అకారణంగా,అన్యాయంగా ఉద్యోగం నుండి తొలగించారనే మనస్థాపంతో ఎవరు లేని సమయంలో కార్యాలయ ఆవరణ సమీప ప్రాంతంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నాగుల్ మీరా శనివారం మృతి చెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు. ఈ విషయంపై యాజమాన్యానికి అనేక సార్లు ఫోన్ చేస్తున్న స్పందించకపోవడంతో,మీరా మృతికి ఇండెన్ గ్యాస్ యాజమాన్యమే కారణమని తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఇండియన్ గ్యాస్ కార్యాలయానికి తాళాలు వేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కూసుమంచి మండలంలోని 41 గ్రామ పంచాయితీల గ్యాస్ వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వినియోగదారులకు గ్యాస్ అందించే ప్రయత్నం చేయాలని మండల ప్రజలు కోరుతుతున్నారు.