- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. నేడు బంగ్లాదేశ్.. చర్చనీయాంశంగా ప్రియాంక బ్యాగ్స్
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వాద్రా స్టేట్ మెంట్ బ్యాగ్స్ తో పార్లమెంటుకు రావడం చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనా అనిరాసి ఉన్న బ్యాగ్‌తో సోమవారం పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో కనిపించిన ప్రియాంకా గాంధీ మంగళవారం కొత్త బ్యాగ్‌తో కనిపించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడుల జరుగతున్నాయి. కాగా.. ఆదాడులను ఖండిస్తున్న సందేశం ఉన్న బ్యాగులను విపక్ష ఎంపీలు వెంట తీసుకువచ్చారు. పార్లమెంటు సమావేశాల వేళ.. వాటిని ప్రదర్శిస్తూ, మైనార్టీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంక (Priyanka Gandhi ) సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల మీద భారత్ గళం విప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని సూచించారు.
పాలస్తీనా మద్దతు
ఇక, సోమవారం పార్లమెంట్‌కు వచ్చేటప్పుడు ప్రియాంక ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగుపై పాలస్తీనా అని రాసి ఉంది. ఇజ్రాయెల్ దాడులతో దుర్భర పరిస్థితులను అనుభవిస్తోన్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఆమె దాన్ని తీసుకువచ్చారు. అయితే ఆ బ్యాగు తీసుకురావడం చర్చనీయాంశమైంది. జాతీయ అంశాల కంటే అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నమంటూ బీజేపీ విమర్శలు గుప్పించారు. ‘‘నేను ఏ బ్యాగు వేసుకోవాలో ఎవరు నిర్ణయిస్తారు? నేను కావాలనుకనేది నేను ధరిస్తా’’ అని స్పష్టంచేశారు. అంతకుముందు అదానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపాలని డిమాండ్ చేస్తూ.. మోడీ, అదానీ ఫొటోలతో ఉన్న బ్యాగుని ప్రియాంక వేసుకొచ్చారు. బ్యాగ్ కు ఒకవైపు, ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi), పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Adani)ల చిత్రం, మరోవైపు ‘మోడీ, అదానీ భాయ్ భాయ్’ అనే నినాదం ముద్రించి ఉన్న బ్యాగులతో కనిపించారు.